రాజన్న సిరిసిల్ల జిల్లా పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్, జూలై 6: రాజన్న సిరిసిల్ల జిల్లా మోహిణికుంట గ్రామానికి చెందిన మంద బిక్షపతి సిరిసిల్లలో కూలి పని ముగించుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని గాయపడ్డాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ పైలట్ మహేష్, ఈఎంటీ ప్రశాంత్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
108 సిబ్బంది సకాలంలో స్పందించి బాధితుడికి వైద్య సేవలు అందించడంతో స్థానికులు వారిని అభినందించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


