Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకు: రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలి

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.
  • ఆర్.

అరకులోయ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రాథమిక హక్కులను కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రాథమిక విధులను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఇతర మూలం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *