వార్త ముఖ్యాంశాలు
- అరకులోయ: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
- ఎంపీడీవో వీసం ప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అధికారులు, సిబ్బంది రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదివి ప్రతిజ్ఞ చేశారు.
- ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆశయాలు, విలువలు, సూత్రాలను గౌరవిస్తూ విధి నిర్వహణలో, నిత్యజీవితంలో ఆచరించాలని ఎంపీడీవో సూచించారు.
అరకులోయ: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో వీసం ప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అధికారులు, సిబ్బంది రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆశయాలు, విలువలు, సూత్రాలను గౌరవిస్తూ విధి నిర్వహణలో, నిత్యజీవితంలో ఆచరించాలని ఎంపీడీవో సూచించారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ మౌలిక విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ప్రజలు, విద్యార్థులు, యువతకు రాజ్యాంగ హక్కులు, విధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కేవీఏ సత్యనారాయణ, పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఇతర మూలం