వార్త ముఖ్యాంశాలు
- అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైభారత్ విశాఖపట్నం, రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
- ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు అధ్యక్షతన దీపప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.
- అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని ప్రిన్సిపల్ వివరించారు.
అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైభారత్ విశాఖపట్నం, రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు అధ్యక్షతన దీపప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని ప్రిన్సిపల్ వివరించారు. ముఖ్య అతిథి యూత్ ఐకాన్ శివమణికంఠ రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ సంధ్యారాణి, ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు సుధీర్, విజయలక్ష్మి విద్యార్థులకు హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. వ్యాసరచన, చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులు, మైభారత్ సర్టిఫికెట్లు అందజేశారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఇతర మూలం