Monday, 25 May 2026
  • Home  
  • అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం*
- ఖమ్మం

అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం*

*మొక్కజొన్న చేల మంటలకు విలువైన వృక్షాలు బుగ్గి* *అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు మొక్కజొన్న కోతల తర్వాత చేలలోని మొక్కల అవశేషాలకు నిప్పు పెడుతున్నారు. ఆ మంటలు అదుపుతప్పి రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి చెట్లు సామాజిక అటవీశాఖ పెంచిన విలువైన చెట్లకు వ్యాపిస్తున్నాయి. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఏటా వందలాది చెట్లు కాలిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారి, అలాగే మండలంలోని అంతర్గత రోడ్ల వెంబడి గత వారం రోజులుగా చేలకు నిప్పు పెట్టే ఘటనలు ఎక్కువయ్యాయి. ఎండ తీవ్రతకు తోడు గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి రోడ్డు పక్కన ఉన్న 10-15 ఏళ్ల వయసున్న చెట్లు పూర్తిగా కాలిపోతున్నాయి ఇప్పటికే చాలా చెట్లు దగ్ధమైనట్లు స్థానికులు చెబుతున్నారు. *అటవీశాఖ అధికారుల వైఫల్యం:* *నిఘా కరువు:* వేసవిలో చేలకు నిప్పు పెట్టడం సాధారణం అని తెలిసినా, అటవీశాఖ సిబ్బంది ముందస్తు నిఘా ఏర్పాటు చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. బీట్ గార్డులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. *అవగాహన శూన్యం:* చేలకు నిప్పు పెట్టవద్దని రైతులకు అవగాహన కల్పించడంలో, నోటీసులు జారీ చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శ ఉంది. గతేడాది కూడా ఇదే తరహాలో చెట్లు కాలిపోయినా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదని, అందుకే ఈ ఏడాది మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతోందని ప్రజలు మండిపడుతున్నారు. *ప్రజల ఆగ్రహం:* ఒక్కో చెట్టు విలువ వేలకు పైనే ఉంటుంది. లక్షల ఆస్తి నష్టపోతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా ‘మాది కాదు, రెవెన్యూది’ అని తప్పించుకుంటున్నారు” అని రోడ్డు పక్కన స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. “చెట్లను కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? వెంటనే బాధ్యులపై అటవీ చట్టం 1967, పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు పెట్టాలి. కాలిపోయిన చోట మళ్లీ మొక్కలు నాటి సంరక్షించాలి” అని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. నిప్పు పెట్టిన వారిని గుర్తించి జరిమానా విధించాలి అని స్థానికులు చెప్తున్నారు ఇటువంటి చర్యలు ఎప్పటికీ పునరావృతం కాకుండా గ్రామాల్లో అటవీశాఖ అధికారులు అవగాహన సదస్సులు కల్పించి నిప్పు పెట్టడం వల్ల జరిగే నష్టాల గురించి వారికి తెలియపరచి విలువైన చెట్లను కాపాడుకోవడం వల్ల కలిగే లాభాల గురించి వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలని స్థానికులు కోరుకుంటున్నారు

*మొక్కజొన్న చేల మంటలకు విలువైన వృక్షాలు బుగ్గి*

*అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం*

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు మొక్కజొన్న కోతల తర్వాత చేలలోని మొక్కల అవశేషాలకు నిప్పు పెడుతున్నారు. ఆ మంటలు అదుపుతప్పి రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి చెట్లు సామాజిక అటవీశాఖ పెంచిన విలువైన చెట్లకు వ్యాపిస్తున్నాయి. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఏటా వందలాది చెట్లు కాలిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రధాన రహదారి, అలాగే మండలంలోని అంతర్గత రోడ్ల వెంబడి గత వారం రోజులుగా చేలకు నిప్పు పెట్టే ఘటనలు ఎక్కువయ్యాయి. ఎండ తీవ్రతకు తోడు గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించి రోడ్డు పక్కన ఉన్న 10-15 ఏళ్ల వయసున్న చెట్లు పూర్తిగా కాలిపోతున్నాయి ఇప్పటికే చాలా చెట్లు దగ్ధమైనట్లు స్థానికులు చెబుతున్నారు.

*అటవీశాఖ అధికారుల వైఫల్యం:*

*నిఘా కరువు:*

వేసవిలో చేలకు నిప్పు పెట్టడం సాధారణం అని తెలిసినా, అటవీశాఖ సిబ్బంది ముందస్తు నిఘా ఏర్పాటు చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. బీట్ గార్డులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

*అవగాహన శూన్యం:*

చేలకు నిప్పు పెట్టవద్దని రైతులకు అవగాహన కల్పించడంలో, నోటీసులు జారీ చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శ ఉంది.

గతేడాది కూడా ఇదే తరహాలో చెట్లు కాలిపోయినా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదని, అందుకే ఈ ఏడాది మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతోందని ప్రజలు మండిపడుతున్నారు.

*ప్రజల ఆగ్రహం:*

ఒక్కో చెట్టు విలువ వేలకు పైనే ఉంటుంది. లక్షల ఆస్తి నష్టపోతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా ‘మాది కాదు, రెవెన్యూది’ అని తప్పించుకుంటున్నారు” అని రోడ్డు పక్కన స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

“చెట్లను కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా?

వెంటనే బాధ్యులపై అటవీ చట్టం 1967, పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు పెట్టాలి. కాలిపోయిన చోట మళ్లీ మొక్కలు నాటి సంరక్షించాలి” అని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

నిప్పు పెట్టిన వారిని గుర్తించి జరిమానా విధించాలి అని స్థానికులు చెప్తున్నారు ఇటువంటి చర్యలు ఎప్పటికీ పునరావృతం కాకుండా గ్రామాల్లో అటవీశాఖ అధికారులు అవగాహన సదస్సులు కల్పించి నిప్పు పెట్టడం వల్ల జరిగే నష్టాల గురించి వారికి తెలియపరచి విలువైన చెట్లను కాపాడుకోవడం వల్ల కలిగే లాభాల గురించి వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలని స్థానికులు కోరుకుంటున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.