ఖమ్మం, జూలై 20 (
పున్నమి ప్రతినిధి)
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజల తరఫున చేపట్టిన ఆందోళనల సందర్భంగా బీజేపీ నాయకులపై నమోదు చేసిన కేసుల విచారణలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా కోర్టుకు పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్‌రావు, ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ మారుతి వరభద్ర ప్రసాద్, మహిళా మోర్చా నాయకురాలు ఉషా నేరుకొండ, పిల్లలమర్రి వెంకట్, దీకొండ శ్యామ్‌సుందర్, ఈస్లావత్ రాంబాబు, సామల ప్రవీణ్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల గొంతుకను అణచివేసేందుకు అక్రమ కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజావ్యతిరేక విధానాలను కొనసాగిస్తుందని బీజేపీ నాయకులు ప్రజలతో కలిసి ఉద్యమిస్తారని హెచ్చరించారు.
ప్రజల సమస్యలపై పోరాటం చేయడం తమ బాధ్యత అని, కేసులు, కోర్టులు, జైళ్లు తమను భయపెట్టలేవని గల్లా సత్యనారాయణ స్పష్టం చేశారు.



