Wednesday, 30 September 2026
  • Home  
  • జాతీయ సేవా పథకం (యన్ యస్ యస్)ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం..
- అనకాపల్లి

జాతీయ సేవా పథకం (యన్ యస్ యస్)ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం..

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జాతీయ సేవా పథకం (యన్ యస్ యస్) ఆవిర్భావం, సేవలు, ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజ సేవలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడమే యన్ యస్ యస్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు.నిస్వార్థ సేవా భావంతో సమాజానికి తమ వంతు సహకారం అందించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.పి. చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ వి.ఎ. సత్యనారాయణ, యన్ యస్ యస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా.వి.చిట్టిబాబు, డా.కె.సుజాత,ఐక్యూఎసి కోఆర్డినేటర్ కె. వెంకన్న, అకడమిక్ కోఆర్డినేటర్ జి. శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

యలమంచిలి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జాతీయ సేవా పథకం (యన్ యస్ యస్) ఆవిర్భావం, సేవలు, ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజ సేవలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడమే యన్ యస్ యస్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు.నిస్వార్థ సేవా భావంతో సమాజానికి తమ వంతు సహకారం అందించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.పి. చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ వి.ఎ. సత్యనారాయణ, యన్ యస్ యస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా.వి.చిట్టిబాబు, డా.కె.సుజాత,ఐక్యూఎసి కోఆర్డినేటర్ కె. వెంకన్న, అకడమిక్ కోఆర్డినేటర్ జి. శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.