Friday, 2 October 2026
  • Home  
  • డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..
- అనకాపల్లి

డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన, తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహన్‌రావు, అనకాపల్లి ఎస్‌డీపీవో ఈ. శ్రీనివాసులు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ, టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్ డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాష్ డ్రైవింగ్ తదితర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహించారు. మొత్తం 123 చలానాలు విధించి రూ.60,485 జరిమానా విధించారు.తనిఖీల్లో 4 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పత్రాల ఉల్లంఘనలకు సంబంధించి 64 చలానాలు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 10 మందిపై, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించిన ఇద్దరిపై చలానాలు విధించారు. ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కూడా చర్యలు తీసుకున్నారు. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరో 32 చలానాలు విధించారు.ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన, తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహన్‌రావు, అనకాపల్లి ఎస్‌డీపీవో ఈ. శ్రీనివాసులు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ, టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్ డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాష్ డ్రైవింగ్ తదితర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహించారు. మొత్తం 123 చలానాలు విధించి రూ.60,485 జరిమానా విధించారు.తనిఖీల్లో 4 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పత్రాల ఉల్లంఘనలకు సంబంధించి 64 చలానాలు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 10 మందిపై, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించిన ఇద్దరిపై చలానాలు విధించారు. ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కూడా చర్యలు తీసుకున్నారు. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరో 32 చలానాలు విధించారు.ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.