Thursday, 1 October 2026
  • Home  
  • పోలీస్ శాఖలో సుదీర్ఘ సేవలందించిన ఏఎస్ఐలకు ఘన వీడ్కోలు..
- అనకాపల్లి

పోలీస్ శాఖలో సుదీర్ఘ సేవలందించిన ఏఎస్ఐలకు ఘన వీడ్కోలు..

అనకాపల్లి, సెప్టెంబర్ 30: పున్నమి ప్రతినిధి (జిల్లా బ్యూరో ) పోలీస్ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా నిస్వార్థంగా సేవలందించి నేడు పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు ఎంతో శ్లాఘనీయమని జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు కొనియాడారు.​జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్బీ) విభాగంలో 36 సంవత్సరాల పాటు సేవలందించిన ఏఎస్ఐ శ్రీ ఎన్.ఫణిదత్తు, అలాగే ఏ.కోడూరు పోలీస్ స్టేషన్‌లో 37 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకున్న ఏఎస్ఐ శ్రీ అబ్దుల్ రెహమాన్‌ లను అదనపు ఎస్పీ శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ​ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజా రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వీరి సేవలు ఆదర్శనీయమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితాన్ని సంపూర్ణ ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత, కుటుంబ సుఖసంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.సత్కారం అందుకున్న ఏఎస్ఐలు మాట్లాడుతూ, తమ సుదీర్ఘ సర్వీసులో సహకరించిన ఉన్నతాధికారులకు, తోటి సిబ్బందికి, అలాగే కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.​ఈ కార్యక్రమంలో ఏవో శ్రీ సి.హెచ్.తిలక్ బాబు, సీఐలు బాల సూర్యరావు, లక్ష్మి, శ్రీనివాసరావు, అశోక్ కుమార్, గోవిందరావు, సతీష్, రమేష్, రమణయ్య, రమణమూర్తి, విజయ ఎస్సైలు ప్రసాద్, సురేష్ బాబు, అంజిబాబు, విక్టోరియా రాణి, సత్య ప్రసాద్, సూర్య ప్రకాష్, శ్రీనివాసరావు, నరసింహారావుతో పాటు ఇతర పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, రిటైర్డ్ అధికారుల కుటుంబ సభ్యులు, బ్యాచ్‌మేట్లు పాల్గొన్నారు.

అనకాపల్లి, సెప్టెంబర్ 30: పున్నమి ప్రతినిధి (జిల్లా బ్యూరో )

పోలీస్ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా నిస్వార్థంగా సేవలందించి నేడు పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు ఎంతో శ్లాఘనీయమని జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు కొనియాడారు.​జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్బీ) విభాగంలో 36 సంవత్సరాల పాటు సేవలందించిన ఏఎస్ఐ శ్రీ ఎన్.ఫణిదత్తు, అలాగే ఏ.కోడూరు పోలీస్ స్టేషన్‌లో 37 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకున్న ఏఎస్ఐ శ్రీ అబ్దుల్ రెహమాన్‌ లను అదనపు ఎస్పీ శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
​ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజా రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వీరి సేవలు ఆదర్శనీయమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితాన్ని సంపూర్ణ ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత, కుటుంబ సుఖసంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.సత్కారం అందుకున్న ఏఎస్ఐలు మాట్లాడుతూ, తమ సుదీర్ఘ సర్వీసులో సహకరించిన ఉన్నతాధికారులకు, తోటి సిబ్బందికి, అలాగే కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.​ఈ కార్యక్రమంలో ఏవో శ్రీ సి.హెచ్.తిలక్ బాబు, సీఐలు బాల సూర్యరావు, లక్ష్మి, శ్రీనివాసరావు, అశోక్ కుమార్, గోవిందరావు, సతీష్, రమేష్, రమణయ్య, రమణమూర్తి, విజయ ఎస్సైలు ప్రసాద్, సురేష్ బాబు, అంజిబాబు, విక్టోరియా రాణి, సత్య ప్రసాద్, సూర్య ప్రకాష్, శ్రీనివాసరావు, నరసింహారావుతో పాటు ఇతర పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, రిటైర్డ్ అధికారుల కుటుంబ సభ్యులు, బ్యాచ్‌మేట్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.