Sunday, 27 September 2026
  • Home  
  • కార్మిక హక్కుల కోసం.. చలో ఢిల్లీ!
- అనకాపల్లి

కార్మిక హక్కుల కోసం.. చలో ఢిల్లీ!

నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి.. కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలి: సీఐటీయూ పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) అచ్యుతాపురం: కార్మిక సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ అచ్యుతాపురం మండల సమావేశం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులకు విఘాతం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. 8 గంటల పని దినం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ, సమ్మె హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో స్కీం వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రమణ, నాగేశ్వరరావు, విజయ, లావణ్య, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి.. కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలి: సీఐటీయూ

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

అచ్యుతాపురం: కార్మిక సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ అచ్యుతాపురం మండల సమావేశం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి, ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులకు విఘాతం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. 8 గంటల పని దినం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ, సమ్మె హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో స్కీం వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రమణ, నాగేశ్వరరావు, విజయ, లావణ్య, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.