డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే చేరువ చేసిన వాలంటీర్ వ్యవస్థను పక్కనపెట్టి, ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంప్యానెల్ చేయడం కూటమి ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి నిదర్శనమని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ విమర్శించారు. ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి, వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు వంటి హామీలు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. ఆ హామీల అమలుకు నిధులు లేవని చెప్పే ప్రభుత్వం, ప్రచారం కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తోందని ప్రశ్నించారు. ప్రజలకు సోషల్ మీడియా ప్రచారం కాదని, ప్రత్యక్షంగా కనిపించే అభివృద్ధి, సంక్షేమం అవసరమని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి, ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చింతా అనురాధ సూచించారు.

వాలంటీర్లను పక్కనపెట్టి.. ప్రచారం కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లా? మాజీ ఎంపీ చింతా అనురాధ
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే చేరువ చేసిన వాలంటీర్ వ్యవస్థను పక్కనపెట్టి, ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంప్యానెల్ చేయడం కూటమి ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి నిదర్శనమని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ విమర్శించారు. ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి, వాలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు వంటి హామీలు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. ఆ హామీల అమలుకు నిధులు లేవని చెప్పే ప్రభుత్వం, ప్రచారం కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తోందని ప్రశ్నించారు. ప్రజలకు సోషల్ మీడియా ప్రచారం కాదని, ప్రత్యక్షంగా కనిపించే అభివృద్ధి, సంక్షేమం అవసరమని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి, ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని చింతా అనురాధ సూచించారు.

