Thursday, 9 July 2026
  • Home  
  • మంత్రి ఆనం పట్టుదల ఫలితం.. శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం
- News - Updates - ఆంధ్రప్రదేశ్ - భక్తి - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మంత్రి ఆనం పట్టుదల ఫలితం.. శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం

రూ.1.50 కోట్లతో భవ్య ఆలయ నిర్మాణానికి భూమిపూజ.. పెన్నా తీరం మరో ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది ఆత్మకూరు, జూలై 5 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): నెల్లూరు జిల్లా ,ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని  చేజర్ల మండలం, పెరుమాళ్లపాడులోని చారిత్రాత్మక శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం మరోసారి పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆత్మకూరు శాసనసభ్యులు  ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాచీన శైవ క్షేత్ర పునర్నిర్మాణానికి ఆదివారం ఘనంగా భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూర్ణకుంభ స్వాగతం, ప్రత్యేక హోమాలు, శివారాధనల మధ్య అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టడం పట్ల గ్రామస్థులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల సీజీఎఫ్ (CGF) నిధులతో ఈ ఆలయాన్ని భవ్యంగా నిర్మించనున్నారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు ఐదు ఎకరాల విశాల ప్రాంగణంలో భారతీయ దేవాలయ శిల్పకళ, సనాతన సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నిబంధనలను అనుసరిస్తూ ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు. ప్రధాన గర్భగుడి, ముఖ మండపం, ప్రాకార గోడలు, ధ్వజస్తంభం, యాగశాల, భక్తులకు విశ్రాంతి సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య వసతులు, ఉద్యానవనం వంటి అన్ని సౌకర్యాలతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ చారిత్రాత్మక ఆలయం సుమారు 200 నుంచి 300 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ప్రాచీన శైవ క్షేత్రంగా గుర్తింపు పొందింది. కాలక్రమేణా వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆలయం శిథిలావస్థకు చేరి ఇసుక మేటల కింద మరుగున పడింది. అనంతరం స్థానికుల ప్రయత్నాలతో ఆలయ ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో దీనికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలన్న డిమాండ్ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడంతో గ్రామస్థుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. భూమిపూజ అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రాచీన దేవాలయాల సంరక్షణ, పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఆలయాలను పరిరక్షించడం ద్వారా భావితరాలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదని, ఈ ప్రాంత చరిత్రకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు పెరుమాళ్లపాడు ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆలయ నిర్మాణంలో సంప్రదాయ శిల్పకళకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. శైవ ఆగమశాస్త్ర ప్రకారం గర్భగుడి, ముఖ మండపం, గోపురం, ప్రాకారాలు నిర్మించడంతో పాటు ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక వాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.ఈ ఆలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత నెల్లూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా అవతరించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ముఖ్యంగా పెన్నా నది తీర ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించే అవకాశముందని, భవిష్యత్తులో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చే ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణ ద్వారా ఆధ్యాత్మికతతో పాటు స్థానిక ఆర్థికాభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధితో పర్యాటకం పెరగడంతో స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు.భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా, భావితరాలకు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెప్పే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండదని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.గ్రామస్థులు మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ కల నేడు నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయం పూర్తయిన తర్వాత పెరుమాళ్లపాడు గ్రామానికి కొత్త గుర్తింపు లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేద పండితులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలు, వేదఘోషలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన భూమిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.

రూ.1.50 కోట్లతో భవ్య ఆలయ నిర్మాణానికి భూమిపూజ.. పెన్నా తీరం మరో ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది

ఆత్మకూరు, జూలై 5 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

నెల్లూరు జిల్లా ,ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని  చేజర్ల మండలం, పెరుమాళ్లపాడులోని చారిత్రాత్మక శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం మరోసారి పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆత్మకూరు శాసనసభ్యులు  ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాచీన శైవ క్షేత్ర పునర్నిర్మాణానికి ఆదివారం ఘనంగా భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూర్ణకుంభ స్వాగతం, ప్రత్యేక హోమాలు, శివారాధనల మధ్య అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టడం పట్ల గ్రామస్థులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్ల సీజీఎఫ్ (CGF) నిధులతో ఈ ఆలయాన్ని భవ్యంగా నిర్మించనున్నారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు ఐదు ఎకరాల విశాల ప్రాంగణంలో భారతీయ దేవాలయ శిల్పకళ, సనాతన సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నిబంధనలను అనుసరిస్తూ ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు. ప్రధాన గర్భగుడి, ముఖ మండపం, ప్రాకార గోడలు, ధ్వజస్తంభం, యాగశాల, భక్తులకు విశ్రాంతి సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య వసతులు, ఉద్యానవనం వంటి అన్ని సౌకర్యాలతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ చారిత్రాత్మక ఆలయం సుమారు 200 నుంచి 300 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ప్రాచీన శైవ క్షేత్రంగా గుర్తింపు పొందింది. కాలక్రమేణా వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆలయం శిథిలావస్థకు చేరి ఇసుక మేటల కింద మరుగున పడింది. అనంతరం స్థానికుల ప్రయత్నాలతో ఆలయ ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో దీనికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలన్న డిమాండ్ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడంతో గ్రామస్థుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది.

భూమిపూజ అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రాచీన దేవాలయాల సంరక్షణ, పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఆలయాలను పరిరక్షించడం ద్వారా భావితరాలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదని, ఈ ప్రాంత చరిత్రకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు పెరుమాళ్లపాడు ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆలయ నిర్మాణంలో సంప్రదాయ శిల్పకళకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. శైవ ఆగమశాస్త్ర ప్రకారం గర్భగుడి, ముఖ మండపం, గోపురం, ప్రాకారాలు నిర్మించడంతో పాటు ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక వాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.ఈ ఆలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత నెల్లూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా అవతరించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ముఖ్యంగా పెన్నా నది తీర ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించే అవకాశముందని, భవిష్యత్తులో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చే ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు.

ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణ ద్వారా ఆధ్యాత్మికతతో పాటు స్థానిక ఆర్థికాభివృద్ధికి కూడా ఊతం లభిస్తుందని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధితో పర్యాటకం పెరగడంతో స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు.భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా, భావితరాలకు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెప్పే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండదని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.గ్రామస్థులు మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ కల నేడు నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయం పూర్తయిన తర్వాత పెరుమాళ్లపాడు గ్రామానికి కొత్త గుర్తింపు లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేద పండితులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలు, వేదఘోషలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన భూమిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.