Thursday, 9 July 2026
  • Home  
  • విద్యార్థి నాయకత్వానికి తొలి అడుగు.. మేడిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ హౌస్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం
- News

విద్యార్థి నాయకత్వానికి తొలి అడుగు.. మేడిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ హౌస్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం

విద్యార్థి నాయకత్వానికి తొలి అడుగు.. మేడిపల్లి నక్కర్త జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ హౌస్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం మేడిపల్లి, జూలై 6: ZPHS మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఎన్నికైన స్కూల్ హౌస్ కౌన్సిల్ సభ్యుల పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులు తమ పదవులను అధికారికంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ, ఉపాధ్యాయుల సమక్షంలో నూతన కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హెడ్ బాయ్‌గా జాల జశ్వంత్, హెడ్ గర్ల్‌లుగా అర్పియ, ఆంజ్ము, డిప్యూటీ హెడ్ బాయ్‌గా ఎస్. భాను, డిప్యూటీ హెడ్ గర్ల్‌గా దోస వర్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ మాట్లాడుతూ, విద్యార్థులు నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులు తమ సహచర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి. రవీందర్, జ్యోత్స్న, హెప్సిబ, డి. వేణుగోపాల్ రెడ్డి, ఎస్. యాదయ్య, కె. రాంమోహన్, కె. కిషన్ నాయక్, బి. శ్రీకాంత్, పి. మలేషా, జె. గిరిజారాణి, వి. భాస్కర్, పి. విజయ, ఎం. పుష్పలత, ఎస్. రమేష్, టి. నర్సింగ్‌రావుతో పాటు PRG ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త పాల్గొని నూతన కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు నూతన నాయకత్వ బృందాన్ని అభినందించారు. మేడిపల్లి నక్కర్త జెడ్పీహెచ్‌ఎస్‌లో నూతనంగా ఎన్నికైన స్కూల్ హౌస్ కౌన్సిల్ సభ్యులు ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం.

విద్యార్థి నాయకత్వానికి తొలి అడుగు.. మేడిపల్లి నక్కర్త జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ హౌస్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం

మేడిపల్లి, జూలై 6:
ZPHS మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఎన్నికైన స్కూల్ హౌస్ కౌన్సిల్ సభ్యుల పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులు తమ పదవులను అధికారికంగా స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ, ఉపాధ్యాయుల సమక్షంలో నూతన కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హెడ్ బాయ్‌గా జాల జశ్వంత్, హెడ్ గర్ల్‌లుగా అర్పియ, ఆంజ్ము, డిప్యూటీ హెడ్ బాయ్‌గా ఎస్. భాను, డిప్యూటీ హెడ్ గర్ల్‌గా దోస వర్ష బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీ మాట్లాడుతూ, విద్యార్థులు నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులు తమ సహచర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి. రవీందర్, జ్యోత్స్న, హెప్సిబ, డి. వేణుగోపాల్ రెడ్డి, ఎస్. యాదయ్య, కె. రాంమోహన్, కె. కిషన్ నాయక్, బి. శ్రీకాంత్, పి. మలేషా, జె. గిరిజారాణి, వి. భాస్కర్, పి. విజయ, ఎం. పుష్పలత, ఎస్. రమేష్, టి. నర్సింగ్‌రావుతో పాటు PRG ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ గుప్త పాల్గొని నూతన కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు నూతన నాయకత్వ బృందాన్ని అభినందించారు.
మేడిపల్లి నక్కర్త జెడ్పీహెచ్‌ఎస్‌లో నూతనంగా ఎన్నికైన స్కూల్ హౌస్ కౌన్సిల్ సభ్యులు ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.