ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి
పలమనేరు, సెప్టెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ) : ఏకాత్మ మానవతావాద ప్రణేత, ప్రముఖ జాతీయవాద ఆలోచనాపరుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి (అంత్యోదయ దివస్) పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని అయ్యాకణ వీధిలో నిరుపేద పిల్లలుకు బీజేపీ సీనియర్ నాయకులు, కాశీ విశేశ్వర ఆలయ కమిటీ సభ్యులు ఎంటిఆర్ ప్రసాద్ ఉచిత బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…సమాజంలో వెనుకబడిన మరియు చివరి వరుసలో ఉన్న వ్యక్తి వికాసమే ధ్యేయంగా (అంత్యోదయ) పండిట్ దీన్ దయాళ్ కలలుగన్న ఆశయ సాధనలో భాగంగా ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.


