నులిపురుగులను నిర్మూలించడమే లక్ష్యం :
అడిషనల్ డిఎంహెచ్వో
పలమనేరు, సెప్టెంబర్ 25 (పున్నమి ప్రతినిధి)
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ వెంకట ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ… విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నులిపురుగుల కారణంగా పిల్లల్లో ఆకలి తగ్గడం, నీరసం, రక్తహీనత, ఎదుగుదలపై ప్రభావం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నులిపురుగుల నివారణ కోసం ఆరోగ్యశాఖ సూచించిన విధంగా మాత్రలు తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, భోజనం ముందు తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం, గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రమైన నీటిని తాగడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీహెచ్సి పత్తికొండ డాక్టర్ మల్లికార్జున రెడ్డి , సూపర్‌వైజర్ జయశంకర్ , ఆరోగ్య సిబ్బంది మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.


