సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం*
ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దేగాం ప్రమోద్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దేగాం ప్రమోద్ మాట్లాడుతూ, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.



