కడప జిల్లా రాజంపేట బైపాస్ రోడ్డులో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న వెంటనే పట్టణ పోలీసులు, రాజంపేట రిస్క్ టీం, అర్బన్ సీఐ నాగార్జున, ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మాజీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూల భాస్కర్ క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించడంలో సహకరించారు. అలాగే మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేందుకు సహాయం చేశారు.
ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.


