Tuesday, 5 May 2026
  • Home  
  • ⚡ బీభత్స గాలివానకు విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది – యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పూర్తి ⚡
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

⚡ బీభత్స గాలివానకు విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది – యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పూర్తి ⚡

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 5 (మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో మే 3వ తేదీ రాత్రి కురిసిన బీభత్స గాలివాన కారణంగా విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు 33 కెవి లైన్లు తెగిపోవడం, 11 కెవి ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడం జరిగింది. ఈ ఘటనతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా మనుబోలు ఎలక్ట్రికల్ ఏఈ అనిల్ కుమార్ మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది పని చేసి అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు. ఇంకా మిగిలిన స్వల్ప పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 5 (మల్లికార్జునరావ్ పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో మే 3వ తేదీ రాత్రి కురిసిన బీభత్స గాలివాన కారణంగా విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పాటు 33 కెవి లైన్లు తెగిపోవడం, 11 కెవి ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడం జరిగింది. ఈ ఘటనతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా మనుబోలు ఎలక్ట్రికల్ ఏఈ అనిల్ కుమార్ మాట్లాడుతూ, యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది పని చేసి అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు. ఇంకా మిగిలిన స్వల్ప పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.