-త్వరలో ప్రతిపాడుకు అడిషనల్ కోర్టు
సోమవారం రాజమహేంద్రవరం లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీ మర్యాదపూర్వకంగా కలిసినది.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రత్తిపాడు కు మంజూరు చేసిన అడిషనల్ కోర్టు విషయమై త్వరితగతిన కోర్టు పనులు ప్రారంభించాలని, సత్వరమే క్యాంటీన్, జెరాక్స్ మెషిన్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు వచ్చాయని, బార్అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం నకు అవసరమైన
స్థలం మంజూరు అయిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కి నూతనం గా ఎన్నికైన కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.
కార్యక్రమము బార్ అధ్యక్షులు రాజాల చిట్టిబాబు, వైస్ ప్రెసిడెంట్, ఆడారి సుగుణ, జనరల్ సెక్రటరీ బొంగుళూరి మధుబాబు, జాయింట్ సెక్రటరీ గెడ్డం కామేశ్వరరావు, ట్రెజరర్ అవసరాల దేవి, స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ మంచికంటి శ్రీనివాస భారతి, లైబ్రరీ సెక్రటరీ లింగంపల్లి శివ కుమార్, మహిళా ప్రతినిధి కలవపల్లి సుజన, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కూచిమంచి సూర్య ప్రకాశరావు,రాయి అచ్యుత రామారావు, బత్తుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


