arigelakrishna- June 16, 2026
- 0 Comments
- 5 Views
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారిపై వైసీపీ నేత గుడివాడ అమరనాథ్ చేసిన అనుచిత, సంస్కారహీనమైన వ్యాఖ్యలను ఖండిస్తూ తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం మండలం, రాజంపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక దళిత మహిళా మంత్రిపై రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి కులతత్వ, చౌకబారు విమర్శలు చేస్తున్నారని మహిళా నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా గోపాలపురం నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు కాకర్ల రామ తులసి ఆధ్వర్యంలో రాజంపాలెం గ్రామంలోని మహిళలంతా కలిసి గుడివాడ అమరనాథ్ చిత్రపటానికి కోడిగుడ్లు విసిరి, దేహశుద్ధి చేస్తూ తమ తీవ్ర ఆగ్రహాన్ని చాటారు. మహిళా లోకాన్ని, హోంమంత్రిని అవమానించేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, అమరనాథ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో మహిళల చేతిలో వైసీపీ నేతలకు తగిన బుద్ధి తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు


