Saturday, 3 October 2026
  • Home  
  • హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ
- తిరుపతి

హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ

శ్రీ కాళహస్తి, ఆగస్టు 16, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని నగిరి వీధిలో గల ‘హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థ (చిల్డ్రన్స్ ఫ్యాన్సీ షాప్) ఆధ్వర్యంలో 176వ నెల ఉచిత సేవా కార్యక్రమాన్ని ఆదివారం అత్యంత మానవీయంగా నిర్వహించారు. ఈ విశిష్ట కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు మునీర్ భాషా నేతృత్వం వహించగా, ప్రముఖులు గరికపాటి రమేష్ బాబు, సుధా ల్యాబ్ హబీబ్ ముఖ్య అతిథులుగా హాజరై తమ చేతుల మీదుగా స్థానిక దివ్యాంగులకు, అనాథలకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు మునీర్ భాషా మాట్లాడుతూ.. గురజాడ అప్పారావు చెప్పినట్లు “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లోకి వెళ్లి యుద్ధం చేయడం మాత్రమే కాదని, సమాజంలో మన కళ్లముందు ఉన్న నిరుపేదలను, దివ్యాంగులను గుర్తించి వారికి మేమున్నామనే నైతిక ధైర్యం కల్పించడం, ఆపన్న హస్తం అందించడం కూడా నిజమైన దేశసేవ అని కొనియాడారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున ప్రతి నెల నిరంతరాయంగా దివ్యాంగులకు, నిరుపేదలకు అందజేస్తున్న ఈ ఆర్థిక, వస్తు సహాయం తమ చిల్డ్రన్స్ ఫ్యాన్సీ షాపు నందు వస్తువులు కొనుగోలు చేసే ప్రతి ఒక్క వినియోగదారునికి చెందుతుందని, ఈ విజయవంతమైన ప్రయాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిరంతర సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, లబ్ధిదారులు, మరియు స్థానిక పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.