రాజన్న సిరిసిల్ల ఆగస్టు 14 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల కేంద్రంలో హమాలి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు సిడబ్ల్యూఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమం నిర్వహించారు సిఐటియు సిడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గిస బిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హమాలి కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు 55 ఏండ్లు నిండిన ప్రతి అమాలి కార్మికుడికి నెలకు. 6 వేల పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ముస్తాబాద్ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో ఎడ్ల రమేష్ సిహెచ్ నరసింహులు కట్కురి నరేష్ ఎడ్ల సంజీవ్ మాడూరి రమేష్ లోకం రాజయ్య తదితరులు పాల్గొన్నారు



