*వరంగల్ జిల్లా నూతనంగా జిల్లా పశుసంవర్ధక శాఖ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బాలాజీ గారిని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (GMPS) వరంగల్ జిల్లా బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.*
*ఈ సందర్భంగా GMPS జిల్లా నాయకులు మాట్లాడుతూ, జిల్లాలోని గొర్రెలు, మేకలు మరియు ఇతర మూగజీవాల పెంపకందారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.* *ముఖ్యంగా పశువైద్య సేవలు, మందులు, టీకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.*
*ఈ సందర్భంగా జె.డి. డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ, వృత్తిపరమైన సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, పశుపోషకులు మరియు వృత్తిదారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.*
*ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు చల్ల మల్లయ్య, జిల్లా కార్యదర్శి పరికి మధుకర్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డి రవి, కావటి సారయ్య, జిల్లా కమిటీ సభ్యులు గాజు యాకయ్య, బోళ్ల భూపాల్ తదితరులు పాల్గొన్నారు.*



