భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసం నంబర్ 1, త్యాగరాజ మార్గ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఎంతో గర్వంగా ఉందని భారత మాజీ ఉప రాష్ట్ర ముప్పు వరపు వెంకయ్య నాయుడు తెలిపారు.
ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పౌరుడు ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరింత మెరుగైన, సుసంపన్నమైన, సామరస్యపూర్వకమైన, సమానత్వంతో కూడిన, సమ్మిళిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు.
భారతదేశ ప్రాచీన విలువలను మార్గదర్శకంగా చేసుకుని, జాతీయతా భావంతో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.



