ప్రభుత్వ ఆదేశాల మేరకు నందిగామ పురపాలక సంఘ పరిధిలోని అన్ని స్వర్ణ వార్డుల్లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకు సంబంధించి వార్డు సభలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వే సోషల్ ఆడిట్ నివేదికలను ఆయా వార్డుల నోటీసు బోర్డుల వద్ద అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.కుటుంబసభ్యుల వివరాలు, కులం, చిరునామా తదితర అంశాల్లో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే వార్డు సభల ద్వారా వాటిని గుర్తించి సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సవరణల కోసం అధికారులను సంప్రదించాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోయూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలక పాత్ర పోషిస్తున్నందున ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలను ధ్రువీకరించుకోవా లని అధికారులు కోరారు. వార్డు సభలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

స్వర్ణ వార్డుల్లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై వార్డు సభలు వివరాల పరిశీలన,సవరణలకు ప్రజలకు అవకాశం