జిల్లాలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి: -జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ కాకినాడ, సెప్టెంబర్ 16: జిల్లాలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాలను అత్యంత పకడ్బందీగా,ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంపై కాకినాడ కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్.. జిల్లా పరిషత్తు,పురపాలక సంస్థ, జిల్లా పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా,పాఠశాల విద్య,పట్టణ పేదరిక నిర్మూలన తదితర శాఖల అధికారులు,పురపాలక కమిషనర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.


