Sunday, 5 July 2026
  • Home  
  • స్కౌట్స్ ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
- తిరుపతి

స్కౌట్స్ ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

శ్రీ కాళహస్తి, జులై 04 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తిలోని భాస్కర్‌పేట మున్సిపల్ హైస్కూల్‌లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్ప, గైడ్ ఇన్‌చార్జ్ నాగజ్యోతి, రాణి, అలాగే ఏపీజే అబ్దుల్ కలాం ఓపెన్ ట్రూప్ స్కౌట్ మాస్టర్ షేక్ అజారుద్దీన్ కలిసి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్ప మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సమరంలో అల్లూరి సీతారామరాజు పోషించిన విశిష్ట పాత్రను, ఆయన చూపిన అసాధారణ పోరాట పటిమను కొనియాడారు. నేటి తరం విద్యార్థులు అల్లూరి దేశభక్తిని, త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దేశభక్తి పూర్వక కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.