Tuesday, 19 May 2026
  • Home  
  • సోలార్ ని ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలి. ఆపతి వెంకట రామారావ్
- ఖమ్మం

సోలార్ ని ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలి. ఆపతి వెంకట రామారావ్

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ప్రధానమంత్రి సూర్య గారి బిజిలియోజన పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక మోడల్ గ్రామాన్ని ఎంపిక చేయాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో అన్నారుగూడెం గ్రామంను ఎంపిక చేశారు. ఈరోజు అన్నారు గూడెం గ్రామంలోని పంచాయితీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి గారు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆశాలత గారు గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ శ్రీనివాసాచారి గారు – “నేను పుట్టిన అన్నారుగూడెం గ్రామానికి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ గ్రామాన్ని సౌర శక్తి ఆధారిత మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోటి రూపాయల అభివృద్ధి నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను గ్రామ అభివృద్ధి కోసం వినియోగిస్తాం. కేంద్రం ‘సూర్యధర్ బిజిలియోజన’ పథకం కింద రాయితీపై సోలార్ పరికరాలను అందిస్తోంది. కాబట్టి ప్రతి గ్రామస్తుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకుడు ఆపది వెంకట రామారావు, తల్లాడ మండల అభివృద్ధి అధికారి ఏ. సురేష్ బాబు, విద్యుత్ శాఖ ఏడీఈ, ఏఈ, సోలార్ నిపుణులు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు రమేష్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు ఎల్లంకి వెంకటేశ్వర్లు, సుధా వెంకటేశ్వర్లు, ఎలమంచి వెంకటేశ్వర్లు, దుర్గినేని సత్యనారాయణ, సోదరామారావు కొమ్మినేని శ్రీనివాసరావు కొమ్మినేని బాబురావు భవాని కోసూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి

ప్రధానమంత్రి సూర్య గారి బిజిలియోజన పథకంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక మోడల్ గ్రామాన్ని ఎంపిక చేయాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో అన్నారుగూడెం గ్రామంను ఎంపిక చేశారు.

ఈరోజు అన్నారు గూడెం గ్రామంలోని పంచాయితీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా అధికారులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి గారు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆశాలత గారు గ్రామాన్ని సందర్శించి, గ్రామస్తులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ శ్రీనివాసాచారి గారు –
“నేను పుట్టిన అన్నారుగూడెం గ్రామానికి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ గ్రామాన్ని సౌర శక్తి ఆధారిత మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోటి రూపాయల అభివృద్ధి నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను గ్రామ అభివృద్ధి కోసం వినియోగిస్తాం. కేంద్రం ‘సూర్యధర్ బిజిలియోజన’ పథకం కింద రాయితీపై సోలార్ పరికరాలను అందిస్తోంది. కాబట్టి ప్రతి గ్రామస్తుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకుడు ఆపది వెంకట రామారావు, తల్లాడ మండల అభివృద్ధి అధికారి ఏ. సురేష్ బాబు, విద్యుత్ శాఖ ఏడీఈ, ఏఈ, సోలార్ నిపుణులు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు రమేష్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు ఎల్లంకి వెంకటేశ్వర్లు, సుధా వెంకటేశ్వర్లు, ఎలమంచి వెంకటేశ్వర్లు, దుర్గినేని సత్యనారాయణ, సోదరామారావు కొమ్మినేని శ్రీనివాసరావు కొమ్మినేని బాబురావు భవాని కోసూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.