మృతుల కుటుంబాలను ఎల్లవేళలా అండగా ఉంటామని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *శ్రీమతి సింగపురం ఇందిరా గారు* అన్నారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డుకు చెందిన కర్నేకంటి వెంకటయ్య గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న సింగపురం ఇందిరా గారు కార్యకర్తలతో వారి కుటుంబానికి బియ్యాన్ని తన వంతు సహాయంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సింగపురం నాగయ్య గారు, సీనియర్ నాయకులు సింగపురం వెంకటయ్య గారు,సింగపురం సందీప్ గారు,సింగపురం కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.


