భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు అమరజీవి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి కార్యాలయంలో సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుండి వామపక్ష భావాలు కలిగి విద్యార్థులను ఉద్యమాల వైపు నడిపించాడు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.ఎన్నో విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటు సభ్యునిగా రెండు దఫాలు నల్గొండ పార్లమెంటు నియోజవర్గం నుండి రెండుసార్లు ఎన్నికై పార్లమెంట్లో ఎన్నో ప్రజా సమస్యలపై తన గళం విప్పిన నేత. అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా 2012 నుండి 2019 వరకు పనిచేశారు. ఆయన నాయకత్వంలో పార్టీని అన్ని రంగాలలో విస్తృత పరిచిన మహోన్నత నేతకు నివాళులు అర్పిస్తూ వారు చూపిన మార్గంలో పయనిస్తూ వారి ఆశయాన్ని మనమంతా కమ్యూనిస్టులుగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని అలా చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో బి కే యం యు జాతీయ సమితి సభ్యులు అక్క పెళ్లి బాబు, జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం, నాయకులు రాధాకృష్ణ, అందుగుల రాజేందర్, బూర్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులు