Tuesday, 11 August 2026
  • Home  
  • సీనియర్ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి
- తూర్పు గోదావరి

సీనియర్ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి

అనపర్తి, జూలై 23 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్‌గా నియమితులైన యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి గురువారం పలువురు సీనియర్ టిడిపి నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్, టిడిపి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆది రెడ్డి శ్రీనివాస్‌లను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకుని, తనకు అందించిన ప్రోత్సాహం, సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి పేర్కొన్నారు.

అనపర్తి, జూలై 23 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి):
అనపర్తి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్‌గా నియమితులైన యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి గురువారం పలువురు సీనియర్ టిడిపి నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్, టిడిపి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆది రెడ్డి శ్రీనివాస్‌లను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకుని, తనకు అందించిన ప్రోత్సాహం, సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.