Thursday, 1 October 2026
  • Home  
  • సీఎం రేవంత్‌రెడ్డికి సద్బుద్ధి కలగాలని గుడేబల్లూర్‌లో బీజేపీ ప్రత్యేక పూజలు
- నారాయణపేట

సీఎం రేవంత్‌రెడ్డికి సద్బుద్ధి కలగాలని గుడేబల్లూర్‌లో బీజేపీ ప్రత్యేక పూజలు

కృష్ణ మండలం గుడేబల్లూర్‌లోని మహాలక్ష్మి దేవాలయంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించాలని, భవిష్యత్తులో హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయకుండా జ్ఞానోదయం కలగాలని కోరుతూ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి మాట్లాడుతూ హిందువులు భగవంతుడు సర్వాంతర్యామి అని, ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడనే నమ్మకంతో జీవిస్తారని అన్నారు. దేవుళ్లను ప్రాంతాల వారీగా విభజించే విధంగా వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. మహాలక్ష్మి అమ్మవారి కృపతో సీఎం రేవంత్‌రెడ్డికి సద్బుద్ధి కలగాలని కోరుతూ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకట రాములు, మండల ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మల్లారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు వొట్టేవోళ్ల సురేష్, జిల్లా కార్యదర్శి కనకరాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు వాకిటి మల్లేష్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కృష్ణ మండలం గుడేబల్లూర్‌లోని మహాలక్ష్మి దేవాలయంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించాలని, భవిష్యత్తులో హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయకుండా జ్ఞానోదయం కలగాలని కోరుతూ అమ్మవారికి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి మాట్లాడుతూ హిందువులు భగవంతుడు సర్వాంతర్యామి అని, ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడనే నమ్మకంతో జీవిస్తారని అన్నారు. దేవుళ్లను ప్రాంతాల వారీగా విభజించే విధంగా వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. మహాలక్ష్మి అమ్మవారి కృపతో సీఎం రేవంత్‌రెడ్డికి సద్బుద్ధి కలగాలని కోరుతూ పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు వెంకట రాములు, మండల ప్రధాన కార్యదర్శి దండు రాఘవేంద్ర, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మల్లారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు వొట్టేవోళ్ల సురేష్, జిల్లా కార్యదర్శి కనకరాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు వాకిటి మల్లేష్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.