ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం.. ప్రతి హృదయంలో దేశభక్తి
కృష్ణ: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కృష్ణ మండలంలోని కున్సి, ఆనంపల్లి, కృష్ణ, ముదుమల్, గుడెబల్లూర్, హిందూపూర్ గ్రామాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు నల్లే నర్సప్ప, బీజేవైఎం అధ్యక్షుడు వొట్టేవోల్ల సురేష్ ఆధ్వర్యంలో యువకులు ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేసి, త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు సోమ్ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఇంటా తిరంగా, ప్రతి హృదయంలో దేశభక్తి ఉండాలని అన్నారు. యువత దేశ భవిష్యత్తు కోసం ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 🇮🇳


