నిర్మల్ జిల్లా అక్టోబర్ 01 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్: బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్ల తొలగింపును ఆమ్ ఆద్మీ పార్టీ సమర్థిస్తుందని, అయితే ఆ పేరుతో ఒక వర్గానికి చెందిన ఓటర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఓటు హక్కును తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ అన్నారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై ఫిర్యాదులు చేసినప్పటికీ కొందరి పేర్లను తిరిగి చేర్చలేదనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరికొందరిని చనిపోయినవారిగా, ఇంకొందరిని ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోయినవారిగా చూపించి ఓటు హక్కును తొలగించడంపై ప్రజల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని, దాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే వివాదాలకు తావిచ్చే విధంగా వ్యవహరించడం ఆందోళనకరమని అన్నారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో యువత, పౌర సమాజ కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ఐక్యమై ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని సయ్యద్ హైదర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

బోగస్ ఓట్ల తొలగింపు పేరుతో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదు – జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్
నిర్మల్ జిల్లా అక్టోబర్ 01 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్: బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్ల తొలగింపును ఆమ్ ఆద్మీ పార్టీ సమర్థిస్తుందని, అయితే ఆ పేరుతో ఒక వర్గానికి చెందిన ఓటర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఓటు హక్కును తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై ఫిర్యాదులు చేసినప్పటికీ కొందరి పేర్లను తిరిగి చేర్చలేదనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరికొందరిని చనిపోయినవారిగా, ఇంకొందరిని ఆ ప్రాంతం వదిలి వెళ్లిపోయినవారిగా చూపించి ఓటు హక్కును తొలగించడంపై ప్రజల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని, దాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే వివాదాలకు తావిచ్చే విధంగా వ్యవహరించడం ఆందోళనకరమని అన్నారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత, పౌర సమాజ కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ఐక్యమై ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని సయ్యద్ హైదర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

