Saturday, 20 June 2026
  • Home  
  • సత్తుపల్లిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు, మద్యం నిల్వలు.. ఇద్దరిపై కేసు నమోదు
- ఖమ్మం

సత్తుపల్లిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు, మద్యం నిల్వలు.. ఇద్దరిపై కేసు నమోదు

సత్తుపల్లి, జూన్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ) ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచిన ఇద్దరిపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తుపల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఎస్సై అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి కాకర్లపల్లి రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, బుగ్గపాడు గ్రామానికి చెందిన దూబికుంట్ల వీర రాఘవులు ఇంట్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లు నిల్వ ఉంచినట్లు కల్లూరు ఏసీపీ వసుందర యాదవ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇద్దరు పంచుల సమక్షంలో ఇంటిని తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేకుండా 20 గ్యాస్ సిలిండర్లు, 730 మద్యం బాటిళ్లు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. విచారణలో దూబికుంట్ల వీర రాఘవులు, అతని చెల్లెలు సాదు రాధిక కలిసి సత్తుపల్లిలోని గ్యాస్ ఏజెన్సీలు, వైన్ షాపుల నుంచి సిలిండర్లు, మద్యం కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు రూ.1,45,413 విలువైన 20 గ్యాస్ సిలిండర్లు, 730 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు: దూబికుంట్ల వీర రాఘవులు (50), బుగ్గపాడు గ్రామం, సత్తుపల్లి మండలం సాదు రాధిక, బుగ్గపాడు గ్రామం పోలీసులు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సత్తుపల్లి, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

ఖమ్మం జిల్లా లోని
సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచిన ఇద్దరిపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

సత్తుపల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఎస్సై అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి కాకర్లపల్లి రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, బుగ్గపాడు గ్రామానికి చెందిన దూబికుంట్ల వీర రాఘవులు ఇంట్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లు నిల్వ ఉంచినట్లు కల్లూరు ఏసీపీ వసుందర యాదవ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది.

దీంతో పోలీసులు ఇద్దరు పంచుల సమక్షంలో ఇంటిని తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేకుండా 20 గ్యాస్ సిలిండర్లు, 730 మద్యం బాటిళ్లు నిల్వ ఉంచినట్లు గుర్తించారు.

విచారణలో దూబికుంట్ల వీర రాఘవులు, అతని చెల్లెలు సాదు రాధిక కలిసి సత్తుపల్లిలోని గ్యాస్ ఏజెన్సీలు, వైన్ షాపుల నుంచి సిలిండర్లు, మద్యం కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు రూ.1,45,413 విలువైన 20 గ్యాస్ సిలిండర్లు, 730 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితులు:

దూబికుంట్ల వీర రాఘవులు (50), బుగ్గపాడు గ్రామం, సత్తుపల్లి మండలం

సాదు రాధిక, బుగ్గపాడు గ్రామం

పోలీసులు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.