నిజమైన కలం ఎడిటర్ ఆరాల. శ్రీనివాసులు
సంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డిని నిజమైన కలం ఎడిటర్ శ్రీనివాసులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిచారు. పత్రికా రంగంలో విశేష అనుభవం దశాబ్దాల కాలంగా వివిధ పత్రికల్లో పనిచేసి సొంత పత్రిక నిజమైన కలం ఎడిటర్ గా శ్రీనివాసులు పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసులు రెడ్డిని సన్మానించారు. అనంతరం నిజమైన కలం పత్రిక ను సీఐ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎడిటర్ శ్రీనివాసులు కొన్ని విషయాలను సీఐ శ్రీనివాసులు రెడ్డితో పంచుకున్నారు. సంగం మండలంలోని పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విలువలతో కూడిన జర్నలిజానికి సమాజంలో ఎప్పుడూ గౌరవం గుర్తింపు ఉంటాయని సీఐ ఈ సందర్భంగా తెలియజేశారు.


