ఆగస్టు 6 పున్నమి ప్రతినిధి
నిర్మల్ జిల్లా బాసరలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. పోలీసుల గౌరవ వందనం అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య గోదావరి నదికి పూజలు నిర్వహించిన మంత్రి జూపల్లి, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్ నాయకులు
పుష్ప గుచ్చం తో స్వాగతం పలికారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి, పలు అభివృద్ధి పనులకు మొత్తం రూ.346 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినా మంత్రి. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు రూ.324 కోట్లతో, మరియు గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు రూ.22 కోట్లతో శంకుస్థాపన చేశారు.
మంత్రి మాట్లాడుతూ బాసర అభివృద్ధి కి 324 కోట్లు కేటాయించడం అభినందనీయం, ముఖ్యంమంత్రి రేవంత్ రెడ్డిని జిల్లా ప్రజలే కాకుండా అమ్మవారి భక్తులు మరచిపోరు అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చదువుల తల్లి క్షేత్రం బాసర క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగాతీర్చిదిద్దుతాంఅన్నారు. ఇప్పటికే దాత సహకారం తో సుమారు 31 కోట్ల తో ఆలయ గర్భగుడి పునర్నిర్మాణ పనులుమొదలయ్యాయి అన్నారు.
Uploaded Video:



