ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 7 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం పిడూరు దళితవాడలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి నూతన ఉత్సవ విగ్రహాల ఆవిష్కరణ, కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

శ్రీ చెన్నకేశవుని సేవలో సోమిరెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 7 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం పిడూరు దళితవాడలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి నూతన ఉత్సవ విగ్రహాల ఆవిష్కరణ, కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

