Monday, 22 June 2026
  • Home  
  • శ్రీశుకబ్రహ్మాశ్రమంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- తిరుపతి

శ్రీశుకబ్రహ్మాశ్రమంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

శ్రీ కాళహస్తి, జూన్ 21, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి శ్రీ సుఖ బ్రహ్మసన ఆశ్రమ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశుకబ్రహ్మాశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, ‘యోగః కర్మసు కౌశలమ్’ అనే భగవద్గీత శ్లోకాన్ని ఉటంకిస్తూ, యోగా అనేది భారతదేశం విశ్వానికి అందించిన అమూల్యమైన వరం అని కొనియాడారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనస్సు, ఆత్మలను అనుసంధానించే సంపూర్ణ జీవన విధానమని స్పష్టం చేశారు. నేటి ఆధునిక ఒత్తిడితో కూడిన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజుకు కొద్ది నిమిషాలైనా యోగా సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చని హితవు పలికారు. అనంతరం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంతో యోగా నేడు ప్రపంచవ్యాప్తమైందని గుర్తుచేశారు. ‘యోగా చేయండి… ఆరోగ్యంగా ఉండండి’ అనే సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు చంద్రప్ప, ప్రముఖ న్యాయవాదులు రాజేశ్వరరావు, రమేష్ బాబు, ఆశ్రమ నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో యోగా సాధకులు, శిష్యులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.