శ్రీ కాళహస్తి, జులై 31, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా శుక్రవారం (31.07.2026) ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారికంగా ప్రకటించినట్లు ఓటర్ల నమోదు అధికారి మరియు ఆర్డీవో ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలో గత జూన్ 15 నుండి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (BLO) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని, ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి డిజిటైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సవరించిన తాజా ముసాయిదా జాబితా ప్రకారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,16,287 గా నమోదైంది. ఇందులో పురుష ఓటర్లు 1,04,158 మంది, మహిళా ఓటర్లు 1,12,121 మంది, మరియు ఇతర ఓటర్లు 8 మంది ఉన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 319 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. మండలాల వారీగా ఓటర్ల వివరాలను పరిశీలిస్తే.. 62 పోలింగ్ కేంద్రాలు కలిగిన శ్రీకాళహస్తి గ్రామీణ మండలంలో 40,619 మంది, 74 పోలింగ్ కేంద్రాలు ఉన్న శ్రీకాళహస్తి అర్బన్ పరిధిలో 51,359 మంది, 80 పోలింగ్ కేంద్రాలతో అత్యధిక ఓటర్లు కలిగిన రేణిగుంట మండలంలో 53,546 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే 56 పోలింగ్ కేంద్రాలు ఉన్న ఏర్పేడు మండలంలో 40,297 మంది, 47 పోలింగ్ కేంద్రాలు కలిగిన తొట్టంబేడు మండలంలో 30,466 మంది ఓటర్లు ఉన్నట్లు ఆర్డీవో విడుదల చేసిన అధికారిక నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

శ్రీకాళహస్తి నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల