శ్రీ కాళహస్తి, జూన్ 21, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ మధుసూదన్ మాట్లాడుతూ.. నిత్య జీవితంలో యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒత్తిడి లేని జీవితం కోసం యోగాను నిత్యం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ముని ప్రసాద్, గుమ్మల రాజేశ్వరరావులతో పాటు కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొని పలు ఆసనాలను సాధన చేశారు.

శ్రీకాళహస్తి కోర్టులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం