Thursday, 30 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ‘శ్రీ వరలక్ష్మి సిల్క్స్’ ప్రారంభం-జబర్దస్త్ వర్ష సందడి
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ‘శ్రీ వరలక్ష్మి సిల్క్స్’ ప్రారంభం-జబర్దస్త్ వర్ష సందడి

శ్రీ కాళహస్తి, జులై 29, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని నెహ్రూ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ వరలక్ష్మి సిల్క్స్’ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవ వేడుక బుధవారం నాడు అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ జబర్దస్త్ వర్ష ముఖ్య అతిథిగా విచ్చేయగా, షోరూమ్ యాజమాన్యం మరియు సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వచ్చిన అభిమానులతో కలిసి వర్ష డాన్స్ వేసి ప్రత్యేక సందడి చేశారు. అనంతరం షోరూమ్‌లోని వివిధ రకాల పట్టు చీరలు, ఆధునిక వస్త్ర శ్రేణిని తిలకించిన వర్ష మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో శ్రీ వరలక్ష్మి సిల్క్స్ సరికొత్త బ్రాంచ్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, మార్కెట్‌లోని మిగిలిన దుకాణాల కంటే ఇక్కడ అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు, లేటెస్ట్ డ్రెస్సెస్ అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు. పట్టణ ప్రజలు, మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. దుకాణ యాజమాన్యం మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో తమ మొట్టమొదటి భారీ వస్త్ర షోరూమ్‌ను ప్రారంభించామని, హోల్‌సేల్ ధరలకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ స్థానిక వినియోగదారుల నమ్మకాన్ని సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.