శ్రీ కాళహస్తి, జులై 29, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి రూరల్ మండలం ఎర్రగుడిపాడు ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్, శ్రీకాళహస్తి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి తో పాటు భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రమీల మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ చేయుటకు రోటరీ క్లబ్ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని ఆమె తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ సబ్యులు ఒకొక్కరుగా మాట్లాడుతూ.. పేద విద్యార్థులను విద్యలో అభివృద్ధి సాధించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని విద్యకు పేదరికం అడ్డు కాదని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థానాలు చేరుకోవాలని, విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిగత శుభ్రతను పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్సిల్స్ పెన్స్ భోజనం ప్లేట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి మ్యాగీ క్లారా, అడ్వకేట్ ఉమా, సభ్యులు తరుణ్, ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు విద్యాసామగ్రి వితరణ చేసేందుకు ముందుంటాం.. రోటరీ క్లబ్