శ్రీ కాళహస్తి, జులై 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘SIR’ వర్క్‌షాప్‌నకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి, ‘SIR’ రాష్ట్ర పరిశీలకులు రితురాజ్ సిన్హా, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘SIR’ రాష్ట్ర కన్వీనర్ నాగోతు రమేష్ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్, తిరుపతి జిల్లా పార్టీ ఇంచార్జ్ పులి వెంకట కృష్ణారెడ్డి విచ్చేయనున్నారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ పరిధిలోని మొత్తం 294 పోలింగ్ బూతులకు చెందిన BLA-2 కార్యకర్తలందరూ తప్పనిసరిగా ఈ వర్క్‌షాప్‌నకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు మండల అధ్యక్షులు, ఇంచార్జీలు, ముఖ్య నాయకులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ 294 మంది BLA-2 కార్యకర్తల హాజరును పర్యవేక్షించాలని ప్రత్యేకంగా సూచించారు. ఈ వర్క్‌షాప్‌లో పార్టీ సంస్థాగత బలోపేతం, ‘SIR’ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, బూత్ స్థాయి కార్యాచరణపై కార్యకర్తలకు కీలక మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుందని పార్టీ ముఖ్య నాయకులు స్పష్టం చేశారు.

శ్రీకాళహస్తిలో ప్రతిష్టాత్మక ‘SIR’ వర్క్‌షాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.. కోలా ఆనంద్