Friday, 10 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి స్వామికి ఘనంగా ప్రత్యేక అభిషేకాలు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి స్వామికి ఘనంగా ప్రత్యేక అభిషేకాలు

శ్రీ కాళహస్తి, జులై 09 : (పున్నమి న్యూస్) : ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని గురు దక్షిణామూర్తి స్వామికి గురువారం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి, భక్తిశ్రద్ధలతో కర్పూర హారతులు ఇచ్చారు. గురువారానికి ఆలయంలో ఎంతో విశేష ప్రాధాన్యత ఉండటంతో దక్షిణామూర్తిని దర్శించుకోవడానికి స్థానిక భక్తులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు స్వామివారిని విశేష పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా అలంకరించగా, భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.