Tuesday, 15 July 2025
  • Home  
  • వ్యాపార మర్యాదలు – 2
- Featured - బిజినెస్

వ్యాపార మర్యాదలు – 2

డైనింగ్ టైం మర్యాద : మీ ఆఫీసు లో కొలీగో, లేక వ్యాపారం లో మిత్రుడో, మీ కంపెనీ వెండరో, మిమ్ములను హోటల్ కి డిన్నర్ కి ఆహ్వానించారు అనుకుందాం . లేదా , మీ పై అధికారి కానీ, కొలీగ్ కానీ,వారి పుట్టిన రోజు, లేదా  ఏదైనా శుభ సమయం సందర్భం గా కొందరు సహోద్యోగులను మీ ఊరిలోని మంచి హోటల్ కి తీసుకు వెళ్ళారు అనుకోండి . డబ్బు చెల్లించేది మీరు కాక పోయినా, ‘ మెనూ ‘ మరియు ధరల పట్టిక చూడండి . అన్నింటికంటే ఖరీదయిన ఐటం ఆర్డర్ చెయ్యకండి ! బాగుండదు ! అన్నింటికన్నా ఉత్తమం ఏమిటంటే , ఎవరైతే పేచేస్తారో , వారినే ఆర్డర్ చెయ్యమని చెప్పండి ! ‘ నువ్వు మా అందరినీ తీసుకు వచ్చావు కాబట్టి, నా వరకూ , నువ్వు ఏది ఆర్డర్ చేసినా నాకు వోకే ! ‘ అని చెప్పండి . మీరు శాకాహారి అయితే , ఆవిషయం చెప్పండి . బిల్లు చెల్లించేది వేరొకరు కాబట్టి , ఖరీదయిన టైగర్ ప్రాన్ లు వగైరాలు ఆర్డర్ చెయ్యకండి . వేరే వారు మీకు డిన్నర్ పార్టీ ఇచ్చేటప్పుడు తిండి విషయం లో మీ సొంత అభిరుచులుపక్కన పెట్టండి . మీకు ఏదైనా ఐటం తినాలి అనిపించినప్పుడు , మీరు మీ కుటుంబాన్ని తీసుకు వెళ్ళినప్పుడు తినండి ! లేదా, మీరు బిల్లు చెల్లించే టప్పుడు, మీ రుచులు అభిరుచులకు చోటుఇవ్వండి . ఇక ఆ డిన్నర్ పార్టీ లో, ‘ అలా కార్టే ( మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వడ్డించడం ) కాకుండా ‘ బఫే సిస్టం ‘ పెడితే, ఇక సమస్యే లేద !! ఒక కుమ్ముడు  కుమ్మెయ్యండి ! మిమ్మల్ని యే శక్తీ ఆప లేదు ! 3 వ్యాపార మర్యాద , వ్యక్తిగత ప్రశ్నలు : మీరొక కొత్త కంపెనీ లో చేరతారు . కొందరు కొలీగ్స్ క్లోజ్ అవుతారు . లేదా మీ కంపెనీ లోకే కొత్త వారు చేరతారు , మీ సెక్షన్ లో నే . కలిసి పని చేసే క్రమం లో క్లోజ్ అవుతారు . వారిని వ్యక్తిగత ప్రశ్నలుఅడిగేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించండి . వ్యాపారం లో , ఉద్యోగం లో క్లోజ్ అయినంత మాత్రాన , చాలా మంది వారి వ్యక్తిగత జీవితాన్ని మనతో పంచుకోవడానికి ఇష్ట పడక పోవచ్చు ! ఈ క్రిందిప్రశ్నలని మనం పూర్తి గా అడగక పోవడం మంచిది !   (1) సార్ / మేడం ! మీకు పిల్లలు ఎంత మంది ? (2) మీకు పెళ్ళి అయిందా ? ఇంకా ఎందుకు కాలేదు ? కుటుంబ బాధ్యతల వల్లనా ? ఎవరూ నచ్చక పోవడం వల్ల నా ? (3) మీరు కాలికి మట్టెలు వేసుకోక పోతే , మీకు పెళ్ళి కాలేదు అనుకున్నాను ! (4) మీకు కారు ఉందా ? (5) ఇప్పటి దాకా మీరు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ? పెళ్ళి అయిన స్త్రీ ఉద్యోగినుల విషయం లో : మీ వారు ఎక్కడ పని చేస్తారు ? ఉద్యోగమా ? వ్యాపారమా ? అవతలి వారు ఇబ్బంది పడ వచ్చు . మనను అధిక ప్రసంగి అనుకోవచ్చు . కాస్త దూరం మెయింటెయిన్ చెయ్య వచ్చు . ఉదాహరణకు పిల్లల విషయం తీసుకుందాం . అవతలి వారు, తనంతట తాను వారి పిల్లల గురించి చెబితే , వినండి . చెప్పక పోతే , అడగకండి . ఇక మీ పిల్లల గురించి . అవతలి వారు అడిగితే నే చెప్పడం మంచిది. అది కూడా మీకు ఆసక్తి ఉంటేనే సుమా ! మన పిల్లల చిన్న నాటి ముచ్చట లూ, వారి చిలిపి చేష్టలు , లేక స్కూలు / కాలేజీ లోపిల్లలు సాధించిన విషయాలు , చెప్పడం మీకు ఆనందం కావచ్చు కానీ, అవతలి వారికి బోర్ కొట్ట వచ్చు . మనం చెబితే , వారు ‘ అబ్బా ! ‘ అని ఆశ్చర్య పోకుండా, ‘ డబ్బా ! ‘ అని విసుగు చెందవచ్చు ! అయినా, మనకి ఆఫీసు లో ఉద్యోగం ఇచ్చింది కంపెనీ వారు మన పిల్లని చూసి కాదు . మీరు వ్యాపారస్తులు అయితే, మీ దగ్గర సరుకు కొనే వారు , మీ పిల్లల టాలెంటు ని చూసి కొనరు కదా ? ఉద్యోగ / వ్యాపార ప్రపంచం తో , మనకి ఆ వ్యక్తి తో నే సంబంధం, వారి కుటుంబం తో కాదు . వారంతట వారు వివరాలు చెబితే తప్ప . ఉద్యోగ వ్యాపార జీవితం లో, మన సంభాషణలను వాటికే పరిమితం చెయ్యడం మంచిది . మీరు బయట నుంచి ఆఫీస్ లోపలికి వస్తున్నారు . లేదా ఒక క్యాబిన్ నుంచి మరొక క్యాబిన్ లోనికి వెళుతున్నారు . మీ వెనక ఎవరు నిలబడి ఉన్నా, వారు డోరు దాటే దాకా , తలుపు తీసిపట్టుకోండి ! అది మీ పై అధికారికే కానవసరం లేదు ! మీ వెనక నిలబడి ఉన్నది ఎవరన్నది ముఖ్యం కాదు . మీ జూనియర్ కావచ్చు , స్త్రీ ఉద్యోగిని / పురుషుడు కావచ్చు . లేక మీ ఆఫీస్ లో పనిచేసే ఆయా కావచ్చు . మీ వెనక టీ కప్పుల ట్రే తో కుర్రాడు నిలబడి ఉండ వచ్చు . తలుపు తీసి మీరు బయటికి / లోపలికి వెళ్ళాక ,  మీరు ఒక సారి వెనుకకు చూసి , డోరు తీసి పట్టుకున్ని, ఆ టీకప్పుల ట్రే కుర్రాడు కూడా డోరు దాటాక మాత్రమే డోరు  వెయ్యండి . చిన్నవారైనా, ఒకరికి మర్యాద నిస్తే, మన పెద్దతనము ఏమీ తగ్గి పోదు ! నా క్యారీర్ లో గతం లో కొంతమంది పై అధికారులు ఇందుకు విరుద్ధం గా ఉండే వారు . వారి క్రింది వారిని పురుగుల వలె చూసే వారు . నేను కొందరి బాసుల వెనకాల నడుస్తున్నప్పుడు , వారుఆఫిస్ డోరు తీసుకుని వెళుతూ ఉంటే, వారి వెనక నేను . తీసి పట్టుకుంటారేమో నని నేను వడివడి గా వారి వనకే వెళ్ళడం, వారు వెనక్కి తిరిగి కూడా చూడకుండా , సీరియస్ గా మొహం పెట్టుకుని,డోర్ ను లాగి వదిలెయ్యడమూ, అది స్పీడు గా వెనక్కి వచ్చి నా మొహానికో, ముక్కు పచ్చడి అయ్యే రిస్కు  కలగడమూ, నేను సమసస్పూర్తి తో వెనక్కి తగ్గి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడమూ -జరిగాయి ఎన్నో సార్లు ! ఈ రోజు వరకూ నా ముక్కు టొమాటో చట్నీ కాక్కుండా , ఇలా సేఫ్ గా ఉంది అంటే దానికి నా సమయ స్పూర్తే కారణం ! మీరు అలాంటి రిస్కు ఇతరులకి ఇవ్వకండి . మీరు డోరు తీసి బయటకి వెళుతున్నా, లేక లోపలికి వస్తున్నా, వెనకాల ఎవరు ఉన్నారో ఒక సారి చూసి , వారు దోఋ దాటే దాక తీసి పట్టుకోండి ,కొంచెం స్మైల్ ఇవ్వండి , నష్టం లేదు , డబ్బు ఖర్చు అసలే లేదు !

డైనింగ్ టైం మర్యాద : మీ ఆఫీసు లో కొలీగో, లేక వ్యాపారం లో మిత్రుడో, మీ కంపెనీ వెండరో, మిమ్ములను హోటల్ కి డిన్నర్ కి ఆహ్వానించారు అనుకుందాం . లేదా , మీ పై అధికారి కానీ, కొలీగ్ కానీ,వారి పుట్టిన రోజు, లేదా  ఏదైనా శుభ సమయం సందర్భం గా కొందరు సహోద్యోగులను మీ ఊరిలోని మంచి హోటల్ కి తీసుకు వెళ్ళారు అనుకోండి .

డబ్బు చెల్లించేది మీరు కాక పోయినా, ‘ మెనూ ‘ మరియు ధరల పట్టిక చూడండి . అన్నింటికంటే ఖరీదయిన ఐటం ఆర్డర్ చెయ్యకండి ! బాగుండదు ! అన్నింటికన్నా ఉత్తమం ఏమిటంటే , ఎవరైతే పేచేస్తారో , వారినే ఆర్డర్ చెయ్యమని చెప్పండి ! ‘ నువ్వు మా అందరినీ తీసుకు వచ్చావు కాబట్టి, నా వరకూ , నువ్వు ఏది ఆర్డర్ చేసినా నాకు వోకే ! ‘ అని చెప్పండి . మీరు శాకాహారి అయితే , ఆవిషయం చెప్పండి . బిల్లు చెల్లించేది వేరొకరు కాబట్టి , ఖరీదయిన టైగర్ ప్రాన్ లు వగైరాలు ఆర్డర్ చెయ్యకండి . వేరే వారు మీకు డిన్నర్ పార్టీ ఇచ్చేటప్పుడు తిండి విషయం లో మీ సొంత అభిరుచులుపక్కన పెట్టండి . మీకు ఏదైనా ఐటం తినాలి అనిపించినప్పుడు , మీరు మీ కుటుంబాన్ని తీసుకు వెళ్ళినప్పుడు తినండి ! లేదా, మీరు బిల్లు చెల్లించే టప్పుడు, మీ రుచులు అభిరుచులకు చోటుఇవ్వండి .

ఇక ఆ డిన్నర్ పార్టీ లో, ‘ అలా కార్టే ( మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వడ్డించడం ) కాకుండా ‘ బఫే సిస్టం ‘ పెడితే, ఇక సమస్యే లేద !! ఒక కుమ్ముడు  కుమ్మెయ్యండి ! మిమ్మల్ని యే శక్తీ ఆప లేదు !

3

వ్యాపార మర్యాద , వ్యక్తిగత ప్రశ్నలు :

మీరొక కొత్త కంపెనీ లో చేరతారు . కొందరు కొలీగ్స్ క్లోజ్ అవుతారు . లేదా మీ కంపెనీ లోకే కొత్త వారు చేరతారు , మీ సెక్షన్ లో నే . కలిసి పని చేసే క్రమం లో క్లోజ్ అవుతారు . వారిని వ్యక్తిగత ప్రశ్నలుఅడిగేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించండి . వ్యాపారం లో , ఉద్యోగం లో క్లోజ్ అయినంత మాత్రాన , చాలా మంది వారి వ్యక్తిగత జీవితాన్ని మనతో పంచుకోవడానికి ఇష్ట పడక పోవచ్చు ! ఈ క్రిందిప్రశ్నలని మనం పూర్తి గా అడగక పోవడం మంచిది !

 

(1) సార్ / మేడం ! మీకు పిల్లలు ఎంత మంది ?

(2) మీకు పెళ్ళి అయిందా ? ఇంకా ఎందుకు కాలేదు ? కుటుంబ బాధ్యతల వల్లనా ? ఎవరూ నచ్చక పోవడం వల్ల నా ?

(3) మీరు కాలికి మట్టెలు వేసుకోక పోతే , మీకు పెళ్ళి కాలేదు అనుకున్నాను !

(4) మీకు కారు ఉందా ?

(5) ఇప్పటి దాకా మీరు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ?

పెళ్ళి అయిన స్త్రీ ఉద్యోగినుల విషయం లో :

మీ వారు ఎక్కడ పని చేస్తారు ? ఉద్యోగమా ? వ్యాపారమా ?

అవతలి వారు ఇబ్బంది పడ వచ్చు . మనను అధిక ప్రసంగి అనుకోవచ్చు . కాస్త దూరం మెయింటెయిన్ చెయ్య వచ్చు .

ఉదాహరణకు పిల్లల విషయం తీసుకుందాం . అవతలి వారు, తనంతట తాను వారి పిల్లల గురించి చెబితే , వినండి . చెప్పక పోతే , అడగకండి .

ఇక మీ పిల్లల గురించి . అవతలి వారు అడిగితే నే చెప్పడం మంచిది. అది కూడా మీకు ఆసక్తి ఉంటేనే సుమా ! మన పిల్లల చిన్న నాటి ముచ్చట లూ, వారి చిలిపి చేష్టలు , లేక స్కూలు / కాలేజీ లోపిల్లలు సాధించిన విషయాలు , చెప్పడం మీకు ఆనందం కావచ్చు కానీ, అవతలి వారికి బోర్ కొట్ట వచ్చు . మనం చెబితే , వారు ‘ అబ్బా ! ‘ అని ఆశ్చర్య పోకుండా, ‘ డబ్బా ! ‘ అని విసుగు చెందవచ్చు !

అయినా, మనకి ఆఫీసు లో ఉద్యోగం ఇచ్చింది కంపెనీ వారు మన పిల్లని చూసి కాదు . మీరు వ్యాపారస్తులు అయితే, మీ దగ్గర సరుకు కొనే వారు , మీ పిల్లల టాలెంటు ని చూసి కొనరు కదా ?

ఉద్యోగ / వ్యాపార ప్రపంచం తో , మనకి ఆ వ్యక్తి తో నే సంబంధం, వారి కుటుంబం తో కాదు . వారంతట వారు వివరాలు చెబితే తప్ప .

ఉద్యోగ వ్యాపార జీవితం లో, మన సంభాషణలను వాటికే పరిమితం చెయ్యడం మంచిది .

మీరు బయట నుంచి ఆఫీస్ లోపలికి వస్తున్నారు . లేదా ఒక క్యాబిన్ నుంచి మరొక క్యాబిన్ లోనికి వెళుతున్నారు . మీ వెనక ఎవరు నిలబడి ఉన్నా, వారు డోరు దాటే దాకా , తలుపు తీసిపట్టుకోండి ! అది మీ పై అధికారికే కానవసరం లేదు ! మీ వెనక నిలబడి ఉన్నది ఎవరన్నది ముఖ్యం కాదు . మీ జూనియర్ కావచ్చు , స్త్రీ ఉద్యోగిని / పురుషుడు కావచ్చు . లేక మీ ఆఫీస్ లో పనిచేసే ఆయా కావచ్చు . మీ వెనక టీ కప్పుల ట్రే తో కుర్రాడు నిలబడి ఉండ వచ్చు . తలుపు తీసి మీరు బయటికి / లోపలికి వెళ్ళాక ,  మీరు ఒక సారి వెనుకకు చూసి , డోరు తీసి పట్టుకున్ని, ఆ టీకప్పుల ట్రే కుర్రాడు కూడా డోరు దాటాక మాత్రమే డోరు  వెయ్యండి . చిన్నవారైనా, ఒకరికి మర్యాద నిస్తే, మన పెద్దతనము ఏమీ తగ్గి పోదు !

నా క్యారీర్ లో గతం లో కొంతమంది పై అధికారులు ఇందుకు విరుద్ధం గా ఉండే వారు . వారి క్రింది వారిని పురుగుల వలె చూసే వారు . నేను కొందరి బాసుల వెనకాల నడుస్తున్నప్పుడు , వారుఆఫిస్ డోరు తీసుకుని వెళుతూ ఉంటే, వారి వెనక నేను . తీసి పట్టుకుంటారేమో నని నేను వడివడి గా వారి వనకే వెళ్ళడం, వారు వెనక్కి తిరిగి కూడా చూడకుండా , సీరియస్ గా మొహం పెట్టుకుని,డోర్ ను లాగి వదిలెయ్యడమూ, అది స్పీడు గా వెనక్కి వచ్చి నా మొహానికో, ముక్కు పచ్చడి అయ్యే రిస్కు  కలగడమూ, నేను సమసస్పూర్తి తో వెనక్కి తగ్గి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడమూ -జరిగాయి ఎన్నో సార్లు ! ఈ రోజు వరకూ నా ముక్కు టొమాటో చట్నీ కాక్కుండా , ఇలా సేఫ్ గా ఉంది అంటే దానికి నా సమయ స్పూర్తే కారణం !

మీరు అలాంటి రిస్కు ఇతరులకి ఇవ్వకండి . మీరు డోరు తీసి బయటకి వెళుతున్నా, లేక లోపలికి వస్తున్నా, వెనకాల ఎవరు ఉన్నారో ఒక సారి చూసి , వారు దోఋ దాటే దాక తీసి పట్టుకోండి ,కొంచెం స్మైల్ ఇవ్వండి , నష్టం లేదు , డబ్బు ఖర్చు అసలే లేదు !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.