యలమంచిలి , సెప్టెంబర్ 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ):
యలమంచిలి నియోజకవర్గం నారాయణపురం కమ్యూనిటీ హాల్లో మంగళవారం వైసీపీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, కరణం ధర్మశ్రీ, కొరసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వందలాది మంది కార్యకర్తల మధ్య ‘జై జగనన్న’ నినాదాలు మార్మోగాయి. టీడీపీ ప్రకటించిన ఆరు హామీలను తుంగలో తొక్కిందని కొరసాల కన్నబాబు విమర్శించారు. కనిగిరికొండ పరిరక్షణ కోసం వైసీపీ పోరాటం చేసి ప్రభుత్వం వెనక్కి తగ్గేలా చేసిందని పెట్ల గణేష్ అన్నారు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రతి కార్యకర్త పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు.


