Wednesday, 9 September 2026
  • Home  
  • వైసీపీ కొత్త అధ్యక్షుడు బెజవాడ నాగేశ్వరరావు
- అనకాపల్లి - ఆంధ్రప్రదేశ్

వైసీపీ కొత్త అధ్యక్షుడు బెజవాడ నాగేశ్వరరావు

యలమంచిలి ఆగష్టు 28(పున్నమి రిపోర్టర్) :యలమంచిలి మండల వైఎస్సార్‌సీపీ పార్టీ అధ్యక్షుడిగా బెజవాడ నాగేశ్వరరావును నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డెపు ప్రసాద్‌లు నాగేశ్వరరావును శాలువాతో సత్కరించి అభినందించారు. నాగేశ్వరరావు గతంలో రెండుసార్లు యలమంచిలి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజకీయ అనుభవం, పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు ధర్మశ్రీ తెలిపారు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ గుర్తింపు, గౌరవం కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోదెపు గోవిందు, రాష్ట్ర పంచాయతీ విభాగం సెక్రటరీ ఎర్రయ్య దొర, రూరల్ పార్టీ అధ్యక్షుడు త్రినాథ్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన అధ్యక్షులను సన్మానిస్తున్న మాజీ ప్రభుత్వ విప్


యలమంచిలి ఆగష్టు 28(పున్నమి రిపోర్టర్) :
యలమంచిలి మండల వైఎస్సార్‌సీపీ పార్టీ అధ్యక్షుడిగా బెజవాడ నాగేశ్వరరావును నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డెపు ప్రసాద్‌లు నాగేశ్వరరావును శాలువాతో సత్కరించి అభినందించారు. నాగేశ్వరరావు గతంలో రెండుసార్లు యలమంచిలి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజకీయ అనుభవం, పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు ధర్మశ్రీ తెలిపారు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ గుర్తింపు, గౌరవం కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బోదెపు గోవిందు, రాష్ట్ర పంచాయతీ విభాగం సెక్రటరీ ఎర్రయ్య దొర, రూరల్ పార్టీ అధ్యక్షుడు త్రినాథ్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నూతన అధ్యక్షులను సన్మానిస్తున్న మాజీ ప్రభుత్వ విప్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.