వైసిపి లో వేధింపులే.. నేటి కూటమి పాలనలో
మంత్రి అండతో బిజెపి కాంట్రాక్టర్ నరాల పై…
బిజెపి సీనియర్ నేత మిడతల మండిపాటు
బిజెపి హౌసింగ్ కాంట్రాక్టర్ నరాల సుబ్బారెడ్డి కి గత ప్రభుత్వంలోని వేధింపులే ప్రస్తుత ప్రభుత్వంలోనూ వేధింపులే అని ఆయనను రక్షించుకునేందుకు న్యాయపరంగా అన్ని పోరాటాలు చేస్తామని బిజెపి సీనియర్ నేత, నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ ధ్వజమెత్తారు.
హౌసింగ్ అధికారులు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని గత ప్రభుత్వంలో పాలకుల మాటలు విని బిజెపికి చెందిన హౌసింగ్ కాంట్రాక్టర్ను తీవ్రంగా వేధించి 4 కోట్ల మేర నష్టపరిచారని ఆరోపించారు.
ప్రభుత్వం మారినా అధికారుల తీరులో మార్పు రాలేదని
హౌసింగ్ సిఐడి విజిలెన్స్ ఎంక్వయిరీ లో 108 కోట్లు అవినీతి జరిగిందని అధికారులు పాక్షికంగా తేల్చారు . మూలల్లో దర్యాప్తు చేస్తే జిల్లాలో అవినీతి 600 కోట్లకు పైగా ఉంటుందని అన్నారు.
ప్రస్తుత జిల్లా కలెక్టర్ మరో మారు విచారణకు ఆదేశించినా, హౌసింగ్ అధికారులు తమను ప్రస్తుత పాలకులు అధికార పార్టీ యంత్రాంగం కాపాడుతుందని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని రమేష్ ఆరోపించారు.
బిజెపికి చెందిన కాంట్రాక్టర్ నరాల సుబ్బారెడ్డి కి నెల్లూరు సిటీ పరిధిలో గత మూడు సంవత్సరాలు గా 2022 నుండి కోటి 70 లక్షలకు పైగా చేసిన పనికి ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో ఉండిపోగా. కార్పొరేటర్లు గా ఉన్న కొంతమంది . బిజెపి కాంట్రాక్టర్ నిర్మించిన గృహాలను వారే నిర్మించినట్లు బిల్లులు పెట్టి అధికారులు కాంట్రాక్టర్లు కలిసి డబ్బు స్వాహా చేశారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంలో బిజెపి కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని మొదట్లో ఆశ ఉండేది. అధికార పార్టీ ఏకపక్ష ధోరణి వల్ల హౌసింగ్ శాఖలో న్యాయం జరగకపోగా అన్యాయమై ఎక్కువైందని,.
హౌసింగ్ అధికారులు పోలీస్ కేసులు పెట్టి బిజెపి కాంట్రాక్టర్ ను ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆయనను ఇబ్బంది పెడితే ఇక చూస్తూ ఊరుకునేది లేదని రమేష్ హెచ్చరించార..
అధికారులు- పాలకులు బిజెపిలో ఒకరిద్దరితో సంబంధాలు కొనసాగిస్తూ తమకు ఎదురులేదని భావిస్తుండడం, ఇద్దరు కీలక బిజెపి నేతలు ఆ మంత్రి నీడలోని వారికి వత్తాసు పలకడం తమకే సిగ్గుచేటు గా ఉందని అన్నారు.
సిద్ధాంతాన్ని నమ్ముకున్న సుబ్బారెడ్డి కిఅన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండే ఓపిక నశించిపోయిందని. అన్ని విధాల న్యాయపోరాటం చేస్తాం. అంతిమంగా *లోకాయుక్త* ద్వారా న్యాయం లభించే వరకు న్యాయపోరాటాన్ని వెంటనే ప్రారంభిస్తున్నామని రమేష్ పేర్కొన్నారు.