రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
అనపర్తి, సెప్టెంబరు 12 (పున్నమి ప్రతినిధి): ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ST రాజాపురం గ్రామానికి చెందిన శ్రీమతి కురుమెల లక్ష్మీ నాగ శివ పార్వతికి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.25,000 విలువైన చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. వైద్య ఖర్చుల భారాన్ని కొంత మేర తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


